గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వడ్డెరలకు మైనింగ్‌లో 15% రిజర్వేషన్ కల్పించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ‘కోటి సంతకాల సేకరణ’ కేవలం ‘టైమ్ పాస్’ అని కొట్టిపారేశారు. లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకు వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం బీసీలు, వడ్డెరల అభ్యున్నతికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.