ముక్కు ద్వారా జరిపే శ్వాసక్రియ గాలిని శుద్ధి చేస్తుంది. అయితే చాలా మంది నిద్రలో నోటి ద్వారా గాలి పీలుస్తుంటారు. ఈ అలవాటు ఆక్సిజన్ సామర్థ్యాన్ని తగ్గించి, ఒత్తిడిని పెంచుతుంది. అంతే కాకుండా నోటితో గాలిని తీసుకోవడం వల్ల కొన్ని శరీర భాగాల్లో మార్పులు, సమస్యలు వస్తాయి. అందుకే నోటితో గాలిని పీల్చుకోవడం ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.