MDK: చిన్నశంకరంపేట మండలం గవలపల్లి శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు.. టీవీఎస్ ఎక్సెల్ స్కూటీ ఢీకొనగా, వెనుక కూర్చున్న మేకల బెన్ని కుమార్ (58) గాయపడ్డాడు. మేడ్చల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం మరణించారు. మృతుడు చేగుంట, వడియారం వాసిగా గుర్తించారు.