కొలంబియా దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రోపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయనను అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారిగా అభివర్ణించారు. మాదకద్రవ్యాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారని తద్వారా మరణాలు, వినాశనానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. USలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ విక్రయించటమే ఆయన ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు. దీనిని ఆపాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.