KMR: బీబీపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ సదర్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన స్వాగత తోరణాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సదర్ సంఘ సభ్యులు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.