VZM: విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ఆదివారం దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమాజానికి నిరంతరం వార్తలు అందించే క్రమంలో నిజాయితీగా వృత్తినే దైవంగా భావించిన మీడియా మిత్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ కొరకు నగదు బహుమతి అందజేశారు.