SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ల బ్రిడ్జి శివారులో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి కల్వర్టు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుకు ఇరువైపులా పిల్లర్స్ (రైలింగ్స్) లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.