VZM: దీపావళీ పండగను ఆనందంగా, సురక్షితంగా కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హితవు పలికారు. ముందుగా జిల్లా ప్రజలకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులపై బాంబులు పేల్చి వాహనదారులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 112ను సంప్రదించాలన్నారు.