వెలుగుల పండగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేలకాంతులు నింపాలని AP మాజీ CM YS జగన్ ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే కాంతి, వెలుగుతో పాటు చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండగ అంటూ ట్వీట్ చేశారు.