TG: నిజాబాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ని కత్తితో పొడిచి చంపిన రియాజ్ను ప్రాణాలతో పట్టుకున్నట్లు CP సాయి చైతన్య తెలిపారు. ప్రమోద్పై దాడి తర్వాత గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు అతను సారంగాపూర్లో పట్టుబడ్డాడని చెప్పారు. ఈ క్రమంలో కూడా ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ దాడికి పాల్పడ్డాడని, అతణ్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.