AP: విశాఖపట్నం యారాడ బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సముద్ర ఆలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. వీరిని గాజువాకకు చెందిన గణేష్(17), పెద గంట్యాడకు చెందిన పవన్(22)గా గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి ఏర్పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.