MBNR: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కౌకుంట్ల మండల కేంద్రంలో పండుగ సందడి మొదలైంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ టపాసులు, దీపాలు, అలంకరణ సామగ్రి కొనుగోళ్లలో మునిగిపోయారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన టపాసుల షాపుల వద్ద కొనుగోలు దారులు ఎగబడుతూ రద్దీగా కనిపిస్తున్నారు.