KDP: దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.