AP: నెల్లూరు ఘటనపై వైసీపీ విషప్రచారం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఘటనకు కులం రంగు పులమడం వైసీపీ దిగజారుడుతనమన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలకు.. కులాలకు సంబంధమేంటని నిలదీశారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఆపలేరని స్పష్టం చేశారు. కాగా నెల్లూరులో ఇటీవల తిరుమశెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగిన విషయం తెలిసిందే.