KNR: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం చొప్పదండి ఆర్నకొండలో, మాజీ ఉప సర్పంచ్ తమ్మడి అనిత శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు స్వప్న శ్రీనివాస్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.