NZB: ఎడపల్లిలోని మంగళ్ పహాడ్ రోడ్, వైన్స్ షాప్ ఎదురుగా సిమెంట్ బ్రిక్స్ ప్లాంట్లో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బ్రిక్స్ ప్లాంట్లోకి చొరబడ్డారు. గడ్డపారతో బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.32 వేలను ఎత్తుకెళ్లినట్లు సిమెంట్ బ్రిక్స్ ప్లాంట్ యజమాని సక్కిరిగా శివ పటేల్ తెలిపారు.