NLG: శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులైన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్‌ను మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆపార్టీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గోస్కొండ వెంకటేష్, కందగట్ల మురళి, జయేందర్, ముద్ధం శ్రీనివాస్, పోలే మల్లయ్య, నరసింహ, మంగి మహేష్‌లు కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో నియోజకవర్గానికి రావాలని కోరారు.
Tags :