NZB: వర్ని మండల కేంద్రంలోని ఏటీఎంలలో ఆదివారం నగదు కొరత ఏర్పడింది. నిన్నటి నుంచి SBI బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎంతో పాటు యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు తెలిపారు. పండగ సందర్భంగా డబ్బులు తీసుకోవడం కోసం ఏటీఎం వెళ్తే నిరాశ ఎదురైందని ప్రజలు వాపోతున్నారు. పండగ వేళల్లో ఏటీఎంలలో నగదు ఉంచుకపోవడం సరికాదన్నారు.