అనంతపురంలోని 144 క్రాకర్స్ దుకాణాల్లో విక్రయాలు మొదలయ్యాయి. ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన స్థలాల్లో అబ్బురపరిచే రకరకాల టపాకాయలు పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. సరసమైన ధరలకే అమ్మకాలు కొనసాగిస్తున్నామని దుకాణాల యజమానులు వెల్లడిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి టపాకాయలు కొనుగోలు చేస్తున్నారు.