ADB: దీపావళి, దండారీ గుస్సాడి పండుగల సందర్భంగా ప్రజలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. ప్రజలు పండుగలను సురక్షితంగా, శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. గుస్సాడి నాట్యం గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అని పేర్కొన్నారు.