వనపర్తి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీకటి నుంచి వెలుగులోకి చెడుపైన మంచి దుష్టశక్తులపైన దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. ఈ పండగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు.