GDWL: 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం గద్వాలలోని వాల్మీకి భవన్లో జరిగిన అఖిలపక్ష కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న జరిగిన బంద్ రిజర్వేషన్ల సాధనలో ఆరంభం మాత్రమేనని తెలిపారు. భవిష్యత్తు పోరాట కార్యాచరణను త్వరలో రూపొందిస్తామని పేర్కొన్నారు.