BDK: దమ్మపేట మండలంలో ఆదివారం అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జగ్గారం గ్రామానికి చెందిన మడివి కృష్ణకుమారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఎమ్మెల్యే వారిని పరామర్శించారు. అనంతరం గొర్రె గుట్ట గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.