WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి పై బ్రిడ్జి ఇనుప చువ్వలు తేలి ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది. ఇటీవలే కొన్ని పేపర్లలో కూడా ప్రచురితమైంది. మండల కేంద్రానికి చెందిన సురేష్ అనే యువకుడు ఆ వార్తకు స్పందించి అతని సొంత ఖర్చుతో ఆ బ్రిడ్జిపై మరమ్మతులు చేయించారు. దీంతో గ్రామస్తులు ప్రయాణికులు అతడిని అభినందించారు.