SRD: జహీరాబాద్ మండలం చిరాక్పల్లి అంతర్రాష్ట్ర ఎక్సైజ్ చెకోపోస్ట్ వద్ద అధికారులు అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఆదివారం ఉదయం గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న వివిధ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేయగా, సుమారు నాలుగు లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఉమారాణి, సిబ్బంది మహేష్, ఉమాదేవి, శివ, కిషన్ తనిఖీల్లో పాల్గొన్నారు.