BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన నరిశెట్టి విజయలక్ష్మి వైద్య చికిత్స ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక మద్దతు లభించింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాధిత కుటుంబానికి ఆదివారం తన కార్యాలయంలో రూ. 2,60,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాయపాలెం మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.