NLG: నల్గొండ ఇండోర్ స్టేడియంలో జరిగిన తైక్వాండో బెల్ట్ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా యువజన క్రీడాధికారి అహ్మద్ అలీ, కార్యదర్శి యాకస్వామి బెల్టులను ప్రదానం చేశారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్, యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.