NZB: సిరికొండలో ఆదివారం పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. తెడ్డు రాజేందర్ పాడి గేదెను కుక్క కరవడంతో గాయమైందని బాధితుడు తెలిపారు. అలాగే మూడేళ్ల అద్విత్ను కుక్క దాడి చేసి కరిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలున్ని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కుక్కల బెడద విపరీతంగా ఉండటంతో ఎప్పుడు ఎవరిని కరుస్తాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.