WNP: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, యువత ఎదుగుదలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని తన నివాసంలో కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో జీవన ప్రమాణాలు పెరిగి సామాన్యులు హీరోలు అయితే, రేవంత్ రెడ్డి విధ్వంస పాలనలో వారు జీరోలుగా మిగిలారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.