BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి నిత్య అన్నదాన నిమిత్తం సికింద్రాబాద్కు చెందిన కడియాల సత్యనారాయణ, కమల దంపతులు రూ.1,00,000/-విరాళంగా ఆదివారం ఆలయ సూపరింటెండెంట్ సాయిబాబాకు అందజేశారు. దాతల దాతృత్వం పట్ల దేవస్థానం అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారికి స్వామి వారు తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు.