AP: నెల్లూరు జిల్లా రాళ్లపాడులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై హోంమంత్రి అనితను సీఎం చంద్రబాబు నివేదిక కోరారు. కూటమి నేతలతో రాళ్లపాడు వెళ్లి ఘటనపై సమీక్షించాలని హోంమంత్రిని ఆదేశించారు. ఇటీవల లక్ష్మీనాయుడును కారుతో హరిచంద్రప్రసాద్ ఢీకొట్టి చంపిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.