KMM: బోనకల్ మండల కేంద్రంలో మధిర నియోజకవర్గ ఇందిరా మహిళా డైరీ లబ్ధిదారులతో ఆదివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.