తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. చెన్నై పట్టాభిరామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉంచిన బాణాసంచాకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.