ELR: ద్వారక తిరుమల మండలం గుండుగొలను కుంటగ్రామ శివారులో జూద శిబిరంపై ఎస్సై సుదీర్ సిబ్బందితో కలిసి ఆదివారం దాడులు చేశారు. ముందస్తు సమాచారంతో సోదాలు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి నాలుగు మోటర్ సైకిల్స్, రూ.41,200 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.