GNTR: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గుండాబత్తిన శ్యాంసన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్యాంసన్ పొన్నూరు మండలం మాచవరంకు చెందిన నేత. తన నియామకానికి కృషి చేసిన వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు శ్యాంసన్ ధన్యవాదాలు తెలిపారు.