ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఆదివారం మంత్రి డోల బాల వీరాంజనేయస్వామిని తన క్యాంపు కార్యాలయంలో పలువురు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. మంత్రి స్వామి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మరికొందరు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఇచ్చి తమ కుటుంబాలకు సహాయ పడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.