TPT: చెన్నైలోని మాధవరం బస్టాండ్ లో ఉన్న తిరుపతి కార్గో పాయింట్ వద్ద డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను ఈ నెల 24వ తేదీన వేలం వేయనున్నట్లు ఆర్టీసీ కార్గో ఇన్చార్జ్ నిర్మల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు వేలం ఉంటుందని, పాట దక్కించుకున్నవారు వెంటనే మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.