BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ కేంద్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న హై-లెవెల్ ఎలక్ట్రిసిటీ టవర్ వర్క్ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.