SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో గల శ్రీముఖలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆదివారం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు వేద ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించినట్లు ఆలయ అనువంశిక అర్చకులు నాయుడు గారి రాజశేఖర్ తెలిపారు.