PPM: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బాణాసంచా పేలిన ఘటన కారణాలపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. నిషేధిత వస్తువులను బుక్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు.