సత్యసాయి: పుట్టపర్తిలోని పోలీస్ కార్యాలయంలో రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం దీపావళి పండగ వేళ ప్రభుత్వ సెలవు కావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, పోలీస్ కార్యాలయానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.