MDK: చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన సాలమ్మ (50) చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు.. శనివారం సాయంత్రం వరి కోత పనుల వద్ద ట్రాక్టర్ రివర్స్ తీసుకునే క్రమంలో సాలమ్మకు తగిలింది. తీవ్ర గాయాలైన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చనిపోయారు.