AP: విజయవాడలోని పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన దీపావళి వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. 15 నెలల్లోనే ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టామని చెప్పారు. అమరావతి పనులు గాడిలో పడ్డాయన్నారు. సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టున్నామని పేర్కొన్నారు. త్వరలో ఏపీ ఏఐగా మారబోతుందని వెల్లడించారు.