ASF: దహేగాం మండలం గెర్రే గ్రామంలో కొడుకు కులం తక్కువ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడని కక్షపూరితంగా కోడలిని హత్య చేసిన శివార్ల సత్తయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని CPM, TAGS, DYFI, AIAWU ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ హత్యను కుల దురాహంకార హత్యగా భావిస్తున్నామని అన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.