SKLM: జిల్లాలో ఈ నెల 21 నుండి 31 వరకు పోలీసు అమర వీరుల స్మారకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరుల ను స్మరించుకుంటూ ప్రతి స్టేషన్ పరిధిలో పలు కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.