ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఏదూలాపాడ్ గ్రామంలో ఈనెల 26న జరిగే అమరజీవి వెడ్మ రాము 38వ వర్ధంతికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెడ్మ రాము చేసిన సేవలు, పోరాటాలను కొనియాడుతూ, గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.