MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం షాటో కాన్ కరాటే ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై లెనిన్ మాట్లాడుతూ.. బాలికలు తమ ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రవి, వీణ, నవీన్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.