KKD: ప్రజలు ఆనందంగా, సురక్షితంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా దీపావళి పండగను జరుపుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలు, పెద్దలతో టపాసులు కాల్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.