SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగం లో గల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి మధుకేశ్వరుని సన్నిధిలో ఆదివారం బాలి యాత్ర దీక్ష స్వీకరణ కార్యక్రమం జరిగింది. నేటి నుంచి 21 రోజులపాటు బాలి యాత్ర నియమ నిష్టలతో జరుగుతుందని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. నవంబర్ 9వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున మధుకేశ్వరుని స్వామి సన్నిధిలో దీక్ష విరమణ జరుగుతుందని పేర్కొన్నారు.