MDK: పిఆర్సి వెంటనే ప్రకటించాలని తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ కోరారు. నర్సాపూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో 317 ద్వారా అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. నాయకులు రవికుమార్, శివకుమార్, కొండల్, రాజు పాల్గొన్నారు.